NTR Statue in Telangana | తెలంగాణలో ఎన్‌టీఆర్ 100 అడుగుల విగ్రహం
NTR Statue in Telangana | తెలంగాణలో ఎన్‌టీఆర్ 100 అడుగుల విగ్రహం
ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న తెలుగు దేశం పార్టీ అధినేత
పార్టీ ఆవిర్భావం జరిగిన చోటే ఎన్‌టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామంటున్న ఆ పార్టీ ఆగ్ర నేతలు
Hyderabad : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సిటీలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి విగ్రహావిష్కరణ చేపట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది.. ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఉత్సాహంతో తెలంగాణలోనూ పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడానికి క్రుషి చేస్తానని గతంలో ఏపీ సీఎం చంద్రబాబు పలు సార్లు టీడీపీ తెలంగాణ నేతలతో అన్నారు. అందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించి చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో తెలంగాణకు చెందిన కొంత మంది నాయకులు చంద్రబాబుకు రెగ్యులర్‌గా టచ్‌లోనే ఉన్నారు. తెలుగు వారు అందరూ ఏకం కావాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, టీడీపీకి చెందిన కార్యకర్తలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ చేసిన సేవలకు ప్రపంచ దేశాల నుంచి ఇప్పటికే మంచి గుర్తింపు వచ్చిందని, ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఎన్‌టీఆర్ విగ్రహం ఏర్పాటు ఇక అనివార్యంగానే భావించాల్సి వస్తుంది.
* తెలంగాణలో రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగు దేశం పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ విగ్రహం నగరంలో ఏర్పాటు చేయడాన్ని ప్రతిపక్ష పార్టీలుగాని, ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీగాని ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.
* అయితే ఏపీ సీఎం చంద్రాబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మధ్య ఉన్న సంబంధాల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఎన్‌టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం టీడీపీకి పెద్ద సమస్య కాకపోవచ్చు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తంమవుతున్నాయి.
* * *
Leave A Comment